అనగనగా గాడిద. అది అడవిలో మేస్తూ వుండేది. అది చాలా కపటమైనది. ఓసారి దానికి సింహం చర్మం దొరికింది. గాడిద దాన్ని వొంటినిండా కప్పుకొని సింహంలా తయారయింది. కనపడినవాళ్లందర్నీ భయపెడుతూ, వాళ్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగెత్తితూ ఉంటే బాగా ఆనందించేంది. సింహం తోలు కప్పుకొన్న గాడిద పైర్లు మేస్తూ హాయిగా కాలం గడిపేది.
రైతులు సింహానికి జడిసి బితుకు బితుకుమంటూ బతుకుతుండేవారు. గాడిద తన్ను ‘ మృగరాజు’ గా ప్రకటించుకొనింది. అది బాగా బలిసిపోయింది. అడవి జంతువులను చూసి కన్నెర్రచేసిది. అవి దాని దెబ్బకు ఠారెత్తిపోయ్యేది. పున్నమివెన్నల. గాడిద ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పొలం వెళ్లి తృప్తిగా మేయసాగింది. పంట కాపులు సింహాన్ని చూసి తలో దిక్కుదౌడు తీశారు.
ఇంతలో ఎక్కడనుంచో గాడిద అరపు వినిపించింది. ఇంకేం మన గాడిద చెవులు రిక్కబొడుచుకొన్నాయి. అది ఆనందంతో తలపైకెత్తి ఓండ్రపెట్ట సాగింది. సింహం గుట్టు రట్టయింది. పంటకాపులు కర్రలెత్తుకొని గాడిదను తరిమి తరిమి కొట్టారు.
ఇతరుల్ని మోసగించేవారు. ఏదో ఒకరోజున పట్టుపడక తప్పదు.
నీతి : మోసగేంచేవారు గోతిలో పడకతప్పదు.
మరింత సమాచారం తెలుసుకోండి: